దెందులూరు మండలంలో పులి ఆనవాళ్లు - ఆందోళనలో గ్రామస్థులు - ఏలూరు జిల్లాలో పులి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 12:03 PM IST
|Updated : Jan 27, 2024, 3:36 PM IST
Tiger Landmarks in Denduluru : ఏలూరు జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామంలో పులి సంచరించిన గుర్తులు కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. గ్రామానికి సమీపంలోని యలమర్తి వేణుగోపాలరావుకు చెందిన పొలాల్లో పులి కదలాడిన గుర్తులు ఉండడంతో రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ రేంజర్ కుమార్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాలి గుర్తులను బట్టి అది మగపులిగా నిర్ధారించారు.
ఈ సందర్భంగా రేంజర్ కుమార్ మాట్లాడుతూ రైతులు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పశువులను జాగ్రత్తగా కట్టేయాలని సూచించారు. కొద్ది రోజులుగా పలు చోట్ల పులి కదలికలు ఉన్నాయని అయితే ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. పులిని గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పులి ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయా గ్రామాల్లోని రైతులకు సూచించారు. తెల్లవారుజామునే పొలాలకు వెళ్లే రైతులు పులి కదలికల సమాచారంతో ఆందోళన చెందుతున్నారు.