ఎమ్మెల్యేకి బెదిరింపులు - చంపేస్తామంటూ మూడు ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ - Threats to MLA Velagapudi
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-02-2024/640-480-20841716-thumbnail-16x9-threat-calls-to-visakha-east-mla.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 11:56 AM IST
Threat Calls to Visakha East MLA: విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావటంతో ఆయన విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ఫోన్ నంబరుకు మూడు నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని రామకృష్ణ బాబు తెలిపారు. దుర్భాషలాడుతూ చంపేస్తాం, అంతు చూస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని రామకృష్ణ బాబు చెప్పారు. ఒక ఫోన్ సింగపూర్ నంబరు కాగా, మరొకటి రంజన్ అనే వ్యక్తి పేరుతో ఉందని వివరించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటి బెదిరింపులు రాష్ట్రం వ్యాప్తంగా సర్వసాధారణం అయిపోయాయని విమర్శించారు. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడు ఈ తరహా కాల్స్ లేవని, దేనికీ తాను భయపడనని రామకృష్ణ బాబు స్పష్టం చేశారు. శనివారం రాత్రి నుంచి విపరీతంగా కాల్స్ చేస్తున్నారని, భయపడే ప్రసక్తి లేదని, దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవడం కోసమే ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.