సత్యనారాయణపురంలో శివాజీ విగ్రహం ఏర్పాటు - తొలగించాలన్న టౌన్ ప్లానింగ్ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 10:24 AM IST

thumbnail

Tension in Vijayawada : రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ  మహారాజ్ 394వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొన్ని ప్రదేశాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,

Chhatrapati Shivaji Statue Issue in Vijayawada : జిల్లాలోని విజయవాడలో బీఆర్​టీఎస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ వద్ద స్థానికులు రైల్వే స్థలంలో ఛత్రపతి శివాజీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. రైల్వే స్థలంలో విగ్రహం తొలగించాలంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి సత్యనారాయణపురం పోలీసులు, ఏఆర్ సిబ్బంది భారీ సంఖ్యలో చేరుకున్నారు. విగ్రహం తొలగిస్తే ఊరుకునేది లేదంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో స్థానికులు అధికారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అధికారులు చర్యను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న వారికి బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.