రాయదుర్గంలో టీడీపీ కార్యకర్త హత్య కేసు - 10మంది నిందితులు అరెస్ట్ - TDP Activist Murder Case - TDP ACTIVIST MURDER CASE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2024/640-480-22047218-thumbnail-16x9-tdp-activist-murder-case.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 8:10 PM IST
Ten Accused Arrested in TDP Activist Murder Case at Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో ఈనెల 9వ తేదీన టీడీపీ కార్యకర్త కొత్తపల్లి ఆదికేశవులు అలియాస్ ఆదెప్ప (51) హత్య కేసులో పదిమందిని నిందితులను అరెస్టు చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ హత్య కేసు వివరాలు వెల్లడించారు. ఆదెప్ప కర్ణాటకలోని నాగసముద్రం నుంచి ద్విచక్ర వాహనంలో మెచ్చిరి గ్రామానికి వస్తుండగా గ్రామ పొలిమేరలో కాపుకాసి హత్య చేసినట్లు తెలిపారు. మృతుడు ఆదెప్ప భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనదని డీఎస్పీ తెలిపారు. రాయదుర్గం సీఐ కేసు దర్యాప్తు ప్రారంభించి సాక్షాధారములను సేకరించి హత్య చేసిన పదిమంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 5 కొడవళ్లు, కత్తులు స్వాధీనం చేసుకుని రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరపరుస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు వివరించారు.