LIVE: కాంతిరాణాపై బదిలీ వేటు - టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం - Bonda Uma media Conference LIVe - BONDA UMA MEDIA CONFERENCE LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 10:15 AM IST

Updated : Apr 24, 2024, 10:27 AM IST

LIVE : అధికార వైఎస్సార్సీపీతో అంటకాగుతూ ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు, దాడులకు తెగబడినా వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెట్టడం, టీడీపీలో క్రియాశీలక నేతలే లక్ష్యంగా వేధింపులకు దిగారనే ఆరోపణలు కాంతిరాణాపై కోకొల్లలు. చివరికి ఎన్నికల కోడ్‌ వచ్చినా ఆయన తీరు మారలేదు. ఇప్పటికీ దాడులకు తెగబడుతున్న అధికార వైకాపా మూకలకే వత్తాసు పలుకుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తినా తీరుమారలేదు.'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా ఏడాదిన్నర కిందట నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో బాబు తప్పించుకోగా, ఆయన భద్రతాధికారికి గాయమైంది. దీనిపై పోలీసులు తేలికపాటి 324 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.తాజాగా విజయవాడలో సీఎం జగన్‌పై గులకరాయి దాడి ఘటనలో అసలైన నిందితులను వదిలేసి  వెలంపల్లి శ్రీనివాస్‌ ఆదేశాలతో టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించేందుకు సీపీ తీవ్రంగా ప్రయత్నించారనే విమర్శలున్నాయి. ఒక పథకం ప్రకారం టీడీపీ నాయకుడు దుర్గారావును బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ఉమా పేరు చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చిన వైనం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇవన్నీ సీపీ పర్యవేక్షణలోనే జరిగాయనే ఆరోపణలున్నాయి.కాంతిరాణాపై బదిలీ వేటుపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం
Last Updated : Apr 24, 2024, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.