చిన్నారులను దారుణంగా చితకబాదిన ఉపాధ్యాయుడు - చిన్నారులను చితకబాదిన ఉపాధ్యాయుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 10:25 AM IST

Updated : Feb 25, 2024, 11:01 AM IST

Teacher Brutally Beat Students in Guntur : ఒకటో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులను ఉపాధ్యాయుడు దారుణంగా చితకబాదిన ఘటన గుంటూరులో జరిగింది. నగరంలోని సంజీయ్యనగర్​ పాఠశాలలో చదువుతున్న సుకన్యరాజ్, జోసఫ్​రాజ్ అనే విద్యార్ధులను ఉపాధ్యాయుడు పి. లక్ష్మీనారాయణ వీపుపై వాతలు పొంగేలా కొట్టారు. దీంతో ఇళ్లకు వెళ్లిన తర్వాత పిల్లలకు జ్వరం వచ్చింది. వారి నాయనమ్మ పిల్లలను పిలిచి కారణం అడగడంతో ఉపాధ్యాయుడు కొట్టిన విషయం చెప్పారు. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు కలిసి పాఠశాలకు వద్దకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు ప్రభూజీని వివరణ కోరారు. కొట్టిన ఉపాధ్యాయుడు అప్పటికే ఇంటికి వెళ్లి పోవడంతో పిలిపించాలంటూ ఆందోళనకు దిగారు. 

గంటన్నర తర్వాత వచ్చిన ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణపై విద్యార్థుల బంధువులు, స్థానికులు ఆగ్రహంతో దాడికి యత్నించడంతో ఇతర ఉపాధ్యాయులు పక్కకు లాక్కొని వెళ్లారు. తాను చేసింది తప్పేనని, విద్యార్ధులు తరగతి గదిలో బూతులు మాట్లాడుతుండగా కొట్టానని, ఇంతలా వాతలు పొంగుతాయని అనుకోలేదని ఉపాధ్యాయుడు ఆందోళనదారులకు చెప్పినా వినిపించుకోలేదు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన ఆందోళన రాత్రి 7.30 గంటల వరకు సాగింది. అనంతరం చిన్నారులు నీరసంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Last Updated : Feb 25, 2024, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.