తాడిపత్రిలో పోటాపోటీ ఫ్లెక్సీలు - 'సిద్ధం' అంటున్న ఇరుపార్టీల నేతలు
🎬 Watch Now: Feature Video
TDP, YSRCP Flexi War in Tadipatri : ఎన్నికల సమీస్తున్న తరుణంలో నేతల మాటల తూటల కన్నా ఫ్లెక్సీల ఏర్పాటు తీరే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా టీడీపీ, వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటు హాట్‌టాపిక్‌గా మారింది. తాడిపత్రి పట్టణంలో 'మేము సిద్ధం ఫ్యాక్షన్‌కి కాదు - అభివృద్ధి కోసం' అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందుకు బదులుగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 'శంఖారావం ఎర్ర బుక్కు కోసం - సిద్ధం ప్రజా సంక్షేమం కోసం' అని ఆయన చిత్రపటంతో ఉన్న ఫ్లెక్సీని దాని పక్కనే ఏర్పాటు చేశారు. వీటిని పట్టణ ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు.
ఇందుకు టీడీపీ కార్యకర్తలు సమాధానం ఇస్తూ అభివృద్ధి ఎవరు చేశారనేది ప్రజలకు బాగా తెలుసు అని చెబుతున్నారు. స్థానిక ప్రజల్లో ఫ్యాక్షన్‌ను రెచ్చగొట్టే విధంగా వైసీపీ ఎమ్మెల్యే తీరు ఉందని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీనే అధిక మెజారిటీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.