'తిక్కోడు తిరునాళ్లకు పోతే ఎక్కా, దిగా సరిపోయిందట- అలా ఉంది సీఎం జగన్ తీరు' - AP Latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 12:47 PM IST
TDP Nara Lokesh on YSRCP MLA Candidates Eighth List: వైసీపీ ఇంఛార్జిల 8వ జాబితాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(TDP Nara Lokesh) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తిక్కోడు తిరునాళ్లకు పోతే ఎక్కా, దిగా సరిపోయిందట అంటూ సీఎం జగన్(CM Jagan) తీరు అలా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ(YSRCP) అంతమైపోతుందని లోకేశ్ పేర్కొన్నారు.
Huge Changes in YSRCP MLA Candidates List: ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే, ఇక ఒకటో అరో ఉంటాయంతే అని చెప్పిన జగన్ సాయంత్రానికే మాట మార్చేశారు. మార్పులుండవని చెప్పి 24 గంటలు కాక ముందే 5 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చారు. అందులోనూ చించిన సీట్లనే చించినట్లుగా మూడుచోట్ల ఇంతకు ముందు మార్చిన వాటినే ఇప్పుడు మళ్లీ మార్చారు. దీంతో సీఎం జగన్ తీరుపై ప్రతిపక్షాలు, విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.