విజయవాడ- ముంబయి ఎయిరిండియా సర్వీస్ ప్రారంభం - హాజరైన ఎంపీ చిన్ని, బాలశౌరి - Vijayawada Mumbai Flight Service - VIJAYAWADA MUMBAI FLIGHT SERVICE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 7:41 PM IST
TDP MPs Starts Air India Flight Service: విజయవాడ- ముంబయి మధ్య ఎయిరిండియా విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో కొత్త విమాన సర్వీస్ ప్రారంభోత్సవానికి ఎంపీలు కేశినేని చిన్ని, వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. అమరావతి రాజధానికి పూర్వవైభవంతో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విజయవాడ నుంచి పలుచోట్లకు మరిన్ని విమాన సర్వీసులు పెంచుతామన్నారు. గన్నవరం- కోల్‌కతా విమానం విశాఖ మీదుగా నడపాలని ప్రతిపాదించామన్నారు. వారానికి రెండు రోజులు వారణాసి వెళ్లే విమానం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు.
విజయవాడ- సింగపూర్ విమానాన్ని మళ్లీ ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని బాలశౌరి పేర్కొన్నారు. థాయిలాండ్, శ్రీలంక వెళ్లే విమాన సర్వీసులను తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. దిల్లీ నుంచి మరో 2 విమాన సర్వీసులు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని బాలశౌరి అన్నారు. గుత్తేదారు వల్ల కొత్త టెర్మినల్ భవన నిర్మాణం ఆలస్యమైందని దానిని 8 నెలల్లోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. గన్నవరాన్ని ప్రపంచస్థాయి విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని చిన్ని పేర్కొన్నారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ సహకారంతో గన్నవరం, అమరావతికి అంతర్జాతీయ శోభను తెస్తామని చిన్ని వెల్లడించారు.