కూటమి అధికారంలోకి రాగానే ప్రతి జిల్లాకు బ్రాహ్మణ భవన్ కేటయిస్తాం: పెమ్మసాని - Pemmasani Meeting with Brahmins - PEMMASANI MEETING WITH BRAHMINS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 8:00 PM IST
Pemmasani Chandrasekhar Intimate Meeting with Brahmins: వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను బ్రష్టు పట్టిస్తోందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. చీమకు కూడా హాని చేయని బ్రాహ్మణులపై వైసీపీ నేతలు ఇష్టారాజ్యాంగా దాడులు చేస్తుంటే సీఎం జగన్ చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. గుంటూరులో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సులో చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్ పాలలో బ్రాహ్మణులపై దాడులు పెరిగాయన్నారు. బ్రాహ్మణ విద్యార్థులను విదేశాలకు పంపించిన ఘనత టీడీపీదేనని, బ్రాహ్మణులు, విద్యార్థులను ఈ జగన్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసిందన్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వైసీపీ వచ్చాక దానికి నిధులు కేటాయించటం ఆపేసిందని విమర్శించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణుల అభివృద్దికి కృషి చేస్తానని ఆయన వివరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి జిల్లాలో బ్రాహ్మణ భవన్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.