పులివెందుల భూ అక్రమాలపై చర్చకు సిద్దమా!- జగన్‌కు రాంగోపాల్ రెడ్డి సవాల్ - MLC Ramgopal Reddy Fire On Jagan - MLC RAMGOPAL REDDY FIRE ON JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 13, 2024, 12:45 PM IST
TDP MLC Ramgopal Reddy Fire On Jagan : వైఎస్సార్ జిల్లా పులివెందులలో జరిగిన అక్రమాలకు, అన్యాయాలను నిగ్గు తేల్చడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల మున్సిపాలిటీలో జగనన్న మెగా లేఅవుట్ (Jagananna Mega Layout)లోనే 175 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఒక్క పులివెందలలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ చర్చకు సిద్దమా? : 2023-24 సంవత్సరానికి సంబంధించి గతంలో పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా జగన్ నాటకాలు మొదలు పెట్టారని రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. పులివెందుల మున్సిపాలిటీ దాదాపు 23 కోట్ల రూపాయులు కరెంట్ బిల్లు చెల్లించాలని, కరెంటు బిల్లులు కట్టలేక వీధిలైట్లు వెలిగించలేని స్థితిలో మున్సిపాలిటీ ఉందని దానికి కారణం జగన్ అని నిప్పులు చెరిగారు. జగన్‌కు పులివెందుల ప్రజలపై ప్రేమ లేదని అన్నారు. పులివెందులలో జరిగిన అక్రమాలకు, అన్యాయాలను నిగ్గు తేల్చడానికి ఎక్కడైనా తాను చర్చకు సిద్దమని జగన్ సిద్ధమా అని రాంగోపాల్ రెడ్డి సవాల్ చేశారు.