పులివెందులలో ఇంటింటి ప్రచారంలో బీటెక్ రవి- కోనేటి వాగు కెనాల్ బాధితులకు పరిహారం చెల్లిస్తామని హామీ - TDP MLA candidate BTech Ravi
🎬 Watch Now: Feature Video
TDP MLA candidate BTech Ravi: వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అంతా కలిసి ఈ సారి ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పలు గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై రవి స్పందించారు. గతంలో డీకేడీ పట్టాలు ఉన్నవాళ్లు, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారన్న కారణంతో, వారికి పట్టాలు కేటాయించే విషయంలో అధికారులు, వైసీపీ నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
గతంలో కెనాల్ కోసం భూములు కోల్పొయిన స్థానికులకు డబ్బులు రాకుండా ఇబ్బందులు పెట్టారని బీటెక్ రవి పేర్కొన్నారు. కెనాల్ పనులు ఇంకా పూర్తి కాలేదని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం భూమి కోల్పొయిన రైతలకు పరిహారం వచ్చేలా చేస్తానని రవి హామీ ఇచ్చారు. చెరుకుపల్లె, అద్దాలులో పట్టా భూముల్లో అక్రమంగా రోడ్డు వేశారని ఆరోపించారు. మూడు రోజుల క్రితంమే చంద్రబాబును కలిశానని బీటెక్ రవి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాడ నిధులు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు అధైర్య పడవద్దని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికి చెల్లింపులు చేస్తామని తెలిపారు. కాలేజీ వాగుకు సంబంధించి, రూ. 4 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం రూ. 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కాలేజీ వాగు పనులు పూర్తి చేసే బాధ్యత, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.