ఇంటింటికీ సూపర్​ సిక్స్​ పథకాలు- ప్రకాశంలో టీడీపీ నేతల ప్రచారం - TDP Leaders Campaigning

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 1:26 PM IST

TDP Leaders Election Campaigning in Prakasam District : వైఎస్సార్సీపీ (YSRCP) పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, 5 ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలపై అనేక దాడులు జరిగాయని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే (MLA) బీఎన్​. విజయకుమార్‌ విమర్శించారు. బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గార్లపాడులో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ (Super Six) పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. రాబోయో ఎన్నికలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటు వేసి చంద్రబాబును (Chandrababu) సీఎం చేయాలని పిలుపునిచ్చారు.

TDP EX- MLA BN Vijay Kumar : టీడీపీ అధికారంలోకి వస్తేనే  రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని విజయకుమార్​ చెప్పారు. వైఎస్సార్సీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ గ్రామ అధ్యక్షులు రాష్ట్ర, పార్లమెంట్ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.