వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ సిబ్బంది - ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు - TDP Complained to EC on Govt Staff
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 1:38 PM IST
TDP Leaders Complained to EC Against on Government Staff: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అధికార వైసీపీ అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందిపై తెలుగుదేశం నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన న్యాయవాదులు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ప్రసాద్ రెడ్డి, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మక్బూల్ అహమ్మద్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్న న్యాయవాదులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అధికార పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సిబ్బంది పాల్గొనకూడదని ఈసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న వాలంటీర్లపై ఈసీకి అందిన ఫిర్యాదుల మేరకు వారిని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఈ ఎన్నికలను ప్రశాంతంగా జరగాలని ఈసీ ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.