అనంతపురం డీఎస్పీ, సీఐలపై టీడీపీ నేతల ఫిర్యాదు- సస్పెండ్‌ చేయాలని డిమాండ్ - TDP leaders Complaint - TDP LEADERS COMPLAINT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 4:49 PM IST

TDP Leaders Complain to Election Observer against Anantapur DSP and CI: అనంతపురం అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్న డీఎస్పీ వీర రాఘవరెడ్డి, సీఐ ప్రతాపరెడ్డిని సస్పెండ్ చేయాలని టీడీపీ నేతలు ఈసీ అధికారికి విజ్ఞప్తి చేశారు. అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల పరిశీలకులు రవికుమార్​కు వినతి పత్రం అందించారు. 

అనంతపురంలోని టీవీ టవర్ సమీపంలో వ్యక్తిగత కారణాలతో టీడీపీ, వైసీపీ నాయకులు గొడవపడితే డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఉద్దేశపూర్వకంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. డీఎస్పీ వీర రాఘవరెడ్డి మొదటి నుంచి వైసీపీ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లోను ఇలాంనే ప్రవర్తించారని గుర్తు చేశారు. ఎన్నికల అధికారులు డీఎస్పీ, సీఐలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని లేదా సస్పెండ్ చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.