టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా అంటూ వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాలుః టీడీపీ నేత వర్లరామయ్య - సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 7:49 PM IST
TDP Leader Varla Ramaiah Fires on YCP Fake Voters in Guntur : తెలుగుదేశం, జనసేన సంయుక్త అభ్యర్థుల జాబితా అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, అశోక్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భావనతోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ఇప్పటి వరకు దాదాపు 70 సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితా అంటూ తప్పుడు ప్రచారం చేసిన వైఎస్సార్సీపీ సామాజిక మాద్యమం బాధ్యులు సజ్జల భార్గవరెడ్డి, ఆయనకు సహకరించిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ కండువ కప్పుకొని మరీ రెచ్చగొట్టిన వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు మీరు అడ్డదారుల్లో రెచ్చగొట్టినంత మాత్రానా ఒరిగేదేం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు.