పుంగనూరు ఏపీలో భాగం కాదా? అక్కడ పెద్దిరెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా? : వర్ల రామయ్య - TDP Varla Ramaiah Complaint to CEO - TDP VARLA RAMAIAH COMPLAINT TO CEO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 10:51 PM IST
TDP Leader Varla Ramaiah Complaint To CEO : చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గం ఏపీలో భాగం కాదా? అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా? అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నాలుగు ప్రచార రథాలు తగులబెట్టారని మండిపడ్డారు. అక్కడి పరిస్థితిపై డీజీపీ సైతం చేతులు ఎత్తేశాడని విమర్శించారు. అక్కడ కానిస్టేబుల్ నుండి పోలీస్ ఉన్నతాధికారులు వరకు కేంద్రబలగాలను పెట్టి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై సీఈఓ ముకేశ్ కుమార్ మీనాని కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
పుంగనూరులో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే అక్కడి డీఎస్పీ మాత్రం ఆ ప్రాంతంలో ఏమి జరగలేదని చెబుతున్నారు. కేవలం కారుపై రెండు రాళ్లు వేశారని తీసిపడేస్తున్నారు. మీడియాకు డీఎస్పీ ఏం మాట్లాడాలన్న ఎమ్మెల్యే నుంచి ఫోన్ వెళుతుందని విమర్శించారు. చివరికి అక్కడి డీఎస్పీ వాష్ రూమ్‌కు వెళ్లాలన్నా పెద్దిరెడ్డి పర్మిషన్ తీసుకోవాలని ఎద్దేవా చేసారు. కాబట్టి అలాంటి డీఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు ఆర్ఓలు పిలిచి మరీ ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆ గుర్తును జనసేనకు మినహా ఎవ్వరికీ ఇవ్వద్ధు అని సీఈఓను కోరినట్లు వర్ల రామయ్య వెల్లడించారు.