ముత్తువకుంట్లలో టీడీపీ నేత తోట ధ్వంసం - వైఎస్సార్సీపీ వర్గీయులే చేశారని బాధితుడు ఆరోపణ - TDP LEADER TREES DESTROY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 11:34 AM IST

Tdp Leader Trees Destroy at Satyasai District: వైఎస్సార్సీపీ నేతల ఆగడాలు రోజురోజుకు పెచ్చురిల్లుతున్నాయి. ఓటమి భయంతో ఇప్పటివరకూ టీడీపీ సానుభూతిపరులు, ఇళ్లుపై దాడులకు పాల్పడిన అధికార పార్టీ నేతలు చెట్లపై కూడా వారి ప్రతాపం చూపిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో టీీడీపీ సానుభూతిపరుని తోటలో 100 మెుక్కలను నరికివేయటంపై రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యక్రమాల్లో బాధితుడు చురుకుగా పాల్గొనడం సహించలేక వైఎస్సార్సీపీ వర్గీయులు నరికేసారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. 

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం ముత్తువకుంట్లకు చెందిన తెలుగుదేశం నేత ముకుంద నాయుడు వ్యవసాయ తోటలో ఎర్రచందనం చెట్లు సాగుచేస్తున్నాడు. ఆదివారం తోటకు వెళ్లేసరికి  100 ఎర్రచందనం చెట్లు (red sandal trees) నరికేసి ఉండడం చూసి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ ఘటనపై కనగానపల్లి పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దుండగులను చేధించి తనకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితుడు పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.