''మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్'' - ఓటు భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది: తంగిరాల సౌమ్య
🎬 Watch Now: Feature Video
My First Vote for CBN poster: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగు యువత ఆధ్వర్యంలో '' మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్'' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ''మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్'' పోస్టర్ రిలీజ్ చేశారు. 18 సంవత్సరాలు నిండి, మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న యువతకు ఓటు పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏపీ ప్రజలకు ఎంతో ముఖ్యమైనవని తంగిరాల సౌమ్య తెలిపారు. రాష్ట్రంలో ఒక సైకోతో పోరాడుతున్నామని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ బాధ్యతాయుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వినియోగించుకునే 18 సంవత్సరాల" యువత'' కోసం కాలేజీలో టీడీపీ తరఫున అవగాహన కార్యక్రమాలు చేపడతామని సౌమ్య తెలిపారు. ఆయా కాలేజీలో యువతతో కలిసి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో నందిగామలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత బాధ్యతగా ఆలోచించి ఓటు వినియోగించుకోవాలని సూచించారు. మీరు వేసే ఓటే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని నూతన ఓటర్లకు సూచించారు.