కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య - వైఎస్సార్సీపీ నేతల పనేనని ఆరోపణలు - TDP Leader Srinu Murder - TDP LEADER SRINU MURDER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 7:57 AM IST
TDP Leader Srinu Murder in Pattikonda : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీను వేకువజామున బహుర్భూమికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి కొడవళ్లతో కిరాతకంగా హతమార్చారు. సాక్ష్యాలు దొరక్కుండా కారంపొడి చల్లి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన శ్రీను : 2019 ఎన్నికల్లో హోసూర్ గ్రామంలో వైఎస్సార్సీపీకి రెండు వేలకు పైగా మెజారిటీ వచ్చింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో శ్రీను కీలకంగా వ్యవహరించాడు. దీంతో ఆ పార్టీకి పూర్తిగా మెజారిటీ బాగా తగ్గిపోయింది. తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడంలో శ్రీను కీలకంగా వ్యవహరించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు శ్రీనుపై కక్ష పెంచుకున్నట్లు బంధువువులు తెలిపారు. తాజాగా శ్రీనుకు నామినేటెడ్ పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీనును వైఎస్సార్సీపీ నేతలే హత్య చేయించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నాయకుడు శ్రీను హత్యను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. టీడీపీ తరఫున కీలకంగా పని చేశాడనే కక్షతోనే శ్రీనును హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో తిరస్కరించినా జగన్ అండ్ కో పంథా మార్చుకోలేదన్నారు. శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.