అధికారాన్ని అడ్డుపెట్టుకుని జవహర్ రెడ్డి అసైన్డ్ భూములను కొట్టేయాలని చూశారు: పల్లా శ్రీనివాస్ - Palla Allegations on Jawahar Reddy - PALLA ALLEGATIONS ON JAWAHAR REDDY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-05-2024/640-480-21589302-thumbnail-16x9-tdp-leader-srinivasarao.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 9:20 PM IST
TDP Leader Srinivasarao Allegations on CS Jawahar Reddy: ఉత్తరాంధ్రలో రూ. 2వేల కోట్ల విలువైన భూకుంభ కోణానికి పాల్పడిన సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడిపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీవో 596 వచ్చిన తర్వాత రైతులకు నేరుగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది రైతులకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో భూములు కాజేసేందుకు కుట్ర చేశారని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని జవహర్ రెడ్డి అసైన్డ్ భూములను కొట్టేయాలని చూశారని దోపిడీకి పాల్పడటం దారుణమని శ్రీనివాసరావు అన్నారు. దళారులతో అగ్రిమెంట్లు చేసుకున్న వారికే ఫ్రీహోల్డ్ పత్రాలు ఇచ్చారని ఆయన తెలిపారు. జీవో ఇచ్చిన 10 రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు జరగటం ఆశ్చర్యకరమని పల్లా పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే భూఆక్రమణలపై విచారణ జరిపించి రైతులకు న్యాయం చేస్తామని పల్లా శ్రీనివాస్ వెల్లడించారు.