అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ అక్రమాలపై విచారణ చేపడతాం: సోమిరెడ్డి - TDP Somireddy on Irrigation
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 3:54 PM IST
TDP Leader Somireddy on Irrigation Department: నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో వందల కోట్లు కుంభకోణం జరిగిందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (TDP Leader Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయకుండా కోట్ల రూపాయలు డ్రా చేశారని తెలిపారు. సీజేఎంఎస్ జేసీ పోర్టల్లో చూస్తే వివరాలు వస్తాయన్నారు. కాలువలు, షట్టర్లు మరమ్మతుల పేరుతో ఎఫ్డీఆర్, ఎన్ఆర్జీఎస్, రెగ్యులర్ ఫండ్స్ నుంచి నిధులు స్వాహా చేశారని చెప్పారు.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani)కి బినామీలుగా ఉన్న శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి నిరంజన్ రెడ్డిలకు నిధులు దోచిపెట్టారని విమర్శించారు. ఇరిగేషన్ అక్రమాలపై నెల రోజుల క్రితమే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ప్రజల సొమ్ము దోపిడీ చేస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం అధికారం చేపట్టిన వెంటనే ఇరిగేషన్ అక్రమాలపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారించి, అందరిపై చర్యలు తీసుకుంటామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.