జగన్ ఘోరాలను షర్మిలే ప్రజలకు వివరిస్తోంది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - వైఎస్ షర్మిల
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-01-2024/640-480-20598735-thumbnail-16x9-tdp-leader-somi-reddy.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 3:43 PM IST
TDP Leader Somi Reddy Fires on CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో 5కోట్ల ప్రజలు చుక్కలు చూస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించిన సొంత సోదరి వైఎస్ షర్మిలనే, జగన్ చేస్తున్న ఘోరాలను రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ నెల 28న నెల్లూరు జిల్లాలో నిర్వహించే 'రా కదిలిరా' కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పాల్గొననున్నారని సోమిరెడ్డి తెలిపారు. నెల్లూరులోని వేణుగోపాల్ స్వామి కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం సందర్భంగా బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను, దుర్మార్గాలను, జగన్ సోదరే చెప్తోందంటే సినిమా ముగిసినట్లేనని విమర్శించారు. రాష్ట్రంలోని పరిస్థితులు తిరోగమనం పట్టాయని ఆయన ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కాపాడుకోవాడానికే ముఖ్యమంత్రికి సమయం సరిపోవడం లేదన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా, భూ దోపిడీలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణపట్నం టెర్మినల్ మూత పడటం ఇవన్నీ చూస్తుంటే ఉమ్మడి జిల్లా ఏమైపోతుందనే ఆందోళన కలుగుతోందన్నారు. సంపదను దోచుకుంటున్నారని, సంపదలు వారి కాళ్ల కింద నలిగిపోతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే టీడీపీ - జనసేన అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రజలకు సూచించారు.