LIVE ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అక్రమ కేసులు- టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - undefined
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 1:09 PM IST
|Updated : Mar 1, 2024, 1:25 PM IST
TDP Leader Pattipati Pullarao Media Conference Live: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌బాబును పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల నిధులు దారిమళ్లించారన్న ఆరోపణలతో ఆయన్ను విజయవాడ మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ అవెక్సా కార్పొరేషన్‌లో తనిఖీలు చేసి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో అక్రమాలు జరిగాయని 16 కోట్ల రూపాయల జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలంటూ 2022లో నోటీసులు జారీ చేసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర డీఆర్‌ఐ అధికారులు విజయవాడ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన భార్య, కుమారుడు, బావ మరిది సహా ఏడుగురిపై కేసు నమోదు చేసింది. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అక్రమ కేసులకు, జగన్ రెడ్డి బెదిరింపులకు లొంగేది లేదుంటున్న పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.
Last Updated : Mar 1, 2024, 1:25 PM IST