LIVE: పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - Panchumarthi Anuradha press meet - PANCHUMARTHI ANURADHA PRESS MEET
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 1:03 PM IST
|Updated : Jun 13, 2024, 1:12 PM IST
TDP Panchumarthi Anuradha Media Conference Live: టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎలాంటి దాడులు, భౌతిక హింసలకు పాల్పడకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై ప్రతీకార దాడులకు టీడీపీ పాల్పడుతోందంటూ ఎక్స్ లో ట్వీట్లు సైతం చేశారు. టీడీపీ కార్యకర్తల దాడులు రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితికి దారితీశాయని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. అయితే టీడీపీపై ఫిర్యాదు చేయటంపై తెలుగుదేశం నేతలు ఖండించారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులకు పాల్పడుతుందంటూ తమపై ఫిర్యాదులు చేయటం సరికాదన్నారు. హత్యలు చేసి ఆహాకారాలు పెట్టడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలని తెలుగుదేశం నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదులపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jun 13, 2024, 1:12 PM IST