LIVE: రాష్ట్రంలో ఇసుక దోపిడీ నిజమేనన్న కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై సీఎం జగన్ సమాధానమేంటి?- నక్కా ఆనంద్‌బాబు లైవ్
🎬 Watch Now: Feature Video
TDP Leader Nakka Anand Babu Live: రాష్ట్రంలో ఇసుక దోపిడీ నిజమేనన్న కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని టీడీపీ నేతలు నిలదీశారు. కాగా రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రిత్వ శాఖ-ఎంఓఈఎఫ్ హైకోర్టుకు తెలిపింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు-సీపీసీబీ, ఎంఓఈఎఫ్ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించారని భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు తేల్చారని వెల్లడించింది. అక్రమ తవ్వకాల ఫోటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు వంటి ఆధారాలను కమిటీ సేకరించిందని ఎంఓఈఎఫ్ తరఫు న్యాయవాది జూపూడి యజ్ఞదత్ హైకోర్టుకు తెలిపారు.
జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్లు కమిటీ నిర్ధారించిందని కోర్టుకు చెప్పారు. పూర్తి వివరాలతో నివేదికను ఎన్జీటీకి అందిస్తామని ఆ వివరాలను హైకోర్టు ముందు ఉంచుతామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఇసుక విధానం ఏమిటి? ధరను ఎలా నిర్ణయిస్తున్నారు? ఎలా రవాణా చేస్తున్నారు? తదితర వివరాలన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ అక్రమ ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.