వైఎస్సార్సీపీ పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయి - మహమ్మద్ ఇక్బాల్ - TDP Leader Mohammed Iqbal
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 5:37 PM IST
TDP Leader Mohammed Iqbal Fired on YSRCP at Kadiri: ఓటర్లను తప్పుదోవ పట్టించేలా వైఎస్సార్సీపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రజలు తిప్పికొట్టాలని టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముస్లిం మైనార్టీలతో టీడీపీ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో అనధికారిక పొత్తును కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం నాయకుడు మహమ్మద్ ఇక్బాల్ అహ్మద్ విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ, జనసేనలతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఓటర్లు గుర్తించాలని సూచించారు. జగన్ తన సొంత పనులను చక్కపెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీతో చేతులు కలుపుతున్నారని, రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీతో కలిసి నడవడాన్ని తప్పు పట్టడం విడ్డూరంగా ఉందని మహమ్మద్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి సరైన నిర్ణయం తీసుకొని ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మైనార్టీల రక్షణ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన పథకాలను ఎన్డీఏ కూటమి కదిరి అసెంబ్లీ కందికుంట వెంకటప్రసాద్ వివరించారు. వైఎస్సార్సీపీ పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయని, మైనారిటీల సంక్షేమాలు మూతపడ్డాయని మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు.