ప్రజల్ని భయపెట్టి సీఎం సభకు తరలిస్తున్నారు : టీడీపీ నేత మంతెన - tdp leader manthena fires on jagan

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 12:27 PM IST

TDP Leader Manthena Satyanarayana Fires on Jagan Meetings: సీఎం జగన్‌ సిద్ధం సభలతో ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతోందని తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజమెత్తారు. సీఎం సభలంటే (CM Meeting) ప్రజలు బెంబేలెత్తుతున్నారని మంతెన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక అగచాట్లు పడుతున్నారని తెలిపారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఇబ్బంది (Traffic trouble)తో వాహనదారులు నరకం చూస్తున్నారని మండిపడ్డారు.

జనాలను తరలించేందుకు ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించి బలవంతంగా బస్సులు తీసుకుంటున్నారని మంతెన ఆరోపించారు. వైసీపీ సభల కోసం పరీక్షలను సైతం వాయిదా వేయిస్తున్నారని మంతెన మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ కన్నా సిద్ధం సభలే మిన్నా అన్నట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సభలకు రాకపోతే పథకాలు నిలిపేస్తారేమోనని ప్రజలను భయపెడుతున్నారన్నారు. సభల నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా పోలీసులను కాపలాగా పెడుతున్నారని మంతెన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.