కడప ఘర్షణలపై న్యాయ విచారణ చేయాలి : టీడీపీ నేత మాధవిరెడ్డి - TDP Leader Madhavi Reddy - TDP LEADER MADHAVI REDDY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 10:30 AM IST

TDP Leader Madhavi Reddy Fire on Police : కడప గౌస్‌ నగర్‌లో జరిగిన ఘర్షణలకు సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదు చేయడాన్ని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, ఆయన అల్లుడు, బంధువులు, పోలింగ్‌ రోజు రాత్రి వాహనాలపైకి ఎక్కి రెచ్చగొట్టారని, టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారని ఆరోపించారు. అలాంటి వారిని వదిలేసి టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం ఏంటని పోలీసులను మాధవిరెడ్డి ప్రశ్నించారు. 

వైఎస్సార్సీపీ వాళ్లు చేసిన తప్పులకు టీడీపీ కార్యకర్తలను ఇరికించడం ఎంతవరకు సమంజసమని మాధవిరెడ్డి నిలదీశారు. ఘర్షణలకు సంబంధించి న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏక పక్షంగా కేసులు నమోదు చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ ఓటమి భయంతోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి, వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. కేసులకు ఎవరూ భయపడొద్దని అందరికీ అండగా ఉంటామని కార్యకర్తలకు ఆమె భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.