LIVE: టీడీపీ నేత పట్టాభి రామ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - TDP Pattabhi Live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 3:16 PM IST

Updated : Jan 31, 2024, 3:30 PM IST

TDP Leader Kommareddy Pattabhi Ram Press Meet Live: రానున్న ఎన్నికల కోసం అభ్యర్థుల మార్పుల, చేర్పులపై తీరిక లేకుండా గడుపుతున్న ముఖ్యమంత్రి దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకూ డుమ్మాకొట్టారు. కనీసం ప్రతినిధుల బృందానికీ అక్కడికి వెళ్లేందుకు అవకాశం కల్పించలేదు. ఐదేళ్ల కాలంలో కేవలం ఒక్కసారే దావోస్‌కు వెళ్లిన జగన్‌, విదేశీ కంపెనీల నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులను కూడా తేలేకపోయారు.

పరిశ్రమలు వస్తే మనకేంటి. రాకపోతే మనకేంటి. పెట్టుబడిదారులు వస్తే ఏంటి. పోతే ఏంటి. రాష్ట్రం ఏమైపోతే మనకేంటి. ఏదోటి చేసి తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే, మరో ఐదు సంవత్సరాల పాటు, కడుపులో చల్ల కదలకుండా ‘వర్క్‌ ఫ్రం హోం సీఎం' గా కొనసాగవచ్చు. సంక్రాంతి వంటి పండగ సందర్భాల్లోనూ అడుగు బయటపెట్టకుండా, ఇంటి పెరట్లోనే భారీ సెట్టింగులు వేయించుకుని పండుగలు చేసేసుకోవచ్చు.

అసలే చలికాలం ఇప్పుడు దావోస్‌లూ, గీవోస్‌లూ అంటే కుదిరే పనే కాదు. అయినా మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనకెందుకులే ఆ దావోస్‌లూ అవీ. ఇలాగే ఉంది మన ముఖ్యమంత్రి జగన్‌ తీరు. ఏటా దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు ఈసారి కూడా జగన్‌ డుమ్మా కొట్టారు. ఆయన వెళ్లలేదు సరికదా, కనీసం రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందాన్నీ పంపలేదు. రాష్ట్రానికి పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించడంపై జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. ఈ నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభి రామ్ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.

Last Updated : Jan 31, 2024, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.