ఎన్నికల వేళ టీడీపీ నేతలపై అక్రమ కేసులు- 'జగన్​ కక్ష సాధింపు చర్యలు' - TDP Bhumireddy Fires on Police

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 3:41 PM IST

TDP Leader Bhumireddy Ram Gopal Reddy Fires on Illegal Cases : ఎన్నికలు సమీపిస్తున్న వేళ  తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తెలుగుదేశం ఇంఛార్జి పుత్తా నరసింహారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జగన్ (Jagan) కక్ష సాధింపునకు నిదర్శనమన్నారు. అసలు ఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు ఎలా పెడతారని భూమిరెడ్డి ప్రశ్నించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవనున్న సమయంలో జగన్​ ప్రోద్బలంతోనే కడప జిల్లాలో పోలీసులు తెలుగుదేశం నేతల్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని భూమిరెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని విచ్చిన్నం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం (Telugu Desam) కార్యకర్తలపై జగన్​ అక్రమ కేసులు (Illegal Cases) బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా తప్పుడు మార్గాల్లో ఇబ్బంది పెట్టడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.