అమెరికాలో టీడీపీ, జనసేన కుటుంబసభ్యుల ఆత్మీయ కలయిక- వైసీపీని ఓడించాలని విజ్ఞప్తి - Alliance Family Members Meet
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 12:05 PM IST
TDP- Janasena Family Members Meeting Held in America: ఎన్నికల సమయంలో దగ్గరపడటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అమెరికాలోని మిల్వాకి నగరంలో తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరిగింది. అంతకు ముందు ఇరు పార్టీలకు చెందిన అభిమానులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. ఈ ఆత్మీయ కలయికకు జూమ్ కాల్స్ ద్వారా తెలుగుదేశం నేతలు ఆరిమిల్లి రాధాకృష్ణ, భూమా అఖిల ప్రియతోపాటు జనసేన నేతలు బొలిశెట్టి సత్యనారాయణ, రాయపాటి అరుణ పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు కోరారు.
ఈ కార్యక్రమంలో మిల్వాకి నుంచే కాకుండా చికాగో నుంచి సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా వంటి దేశంలో ఉన్న తెలుగు ప్రజలు కూటమి గెలుపునే కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని కూటమి అధినేతలు నాయకులు, కార్యకర్తలకు సూచిస్తున్నారు.