టీడీఆర్ కుంభకోణంలో జగన్ తప్పకుండా అరెస్టు అవుతారు: బుద్దా వెంకన్న - Buddha Comments on Jagan - BUDDHA COMMENTS ON JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 9, 2024, 10:30 PM IST
TDP Complaint to DGP Investigate TDR Bonds Scam : గత ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో పెద్దఎత్తున టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు అధికార దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆధారాలున్నాయని ఆయన అన్నారు. టీడీఆర్ కుంభకోణంలో జగన్ తప్పకుండా అరెస్టు అవుతారని బుద్దా వెంకన్న అన్నారు. సీఎంగా ఉన్న సమయంలో జగన్ 42 వేల కోట్లు దోచుకున్నారని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు.
జగన్ ఇసుక, గనులు, మద్యం, భూముల మీద కూడా దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లు కట్టించే వరకు తమ పోరాటం సాగుతోందని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలం గజం 2వేలు ఉన్న ప్రాంతంలో ఎకరాలు చొప్పున వైఎస్సార్సీపీ నేతలు కొనుగోలు చేశారని లేవనెత్తారు. మళ్లీ సీఎంగా జగనే అధికారంలోకి వస్తారనే ఉద్దేశంతో అడ్డగోలుగా చేశారని ఇప్పుడు ఆయనే అందరికన్నా ముందు జైలుకు వెళతారని విమర్శించారు.