శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు- ఆలయంలో ప్రత్యేక పూజలు - chandrababu Couple Srisailam Tour - CHANDRABABU COUPLE SRISAILAM TOUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 4:05 PM IST
TDP Chief chandrababu Couple Visited Srisailam Temple: తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం శ్రీశైలం నుంచి చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద తెలుగుదేశం నాయకులు, అభిమానులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబును చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మరోవైపు చంద్రబాబు ప్రజాగళం సభలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ సర్కారుపై చంద్రబాబు గర్జించిన సింహంలా విరుచుకుపడుతున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇప్పటికే ఆరు నియోజకవర్గాల్లో ప్రజాగళం- వారాహి విజయోత్సవ సభలు విజయవంతంగా నిర్వహించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇతర బీజేపీ జాతీయ నేతలు జతకట్టనున్నారు. ఈలోగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.