ప్రొద్దుటూరు ప్రజల ఎవరూ రాచమల్లును నమ్మొద్దు: వరదరాజులరెడ్డి - TDP candidate Varadarajulu - TDP CANDIDATE VARADARAJULU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 5:05 PM IST
TDP candidate Varadarajulu Comment on YCP MLA Rachamallu : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు తప్పుగా చూపించారని టీడీపీ అభ్యర్థి వరదరాజులు ఆరోపించారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి విలువ రూ. 150 కోట్లుగా చూపించారని గుర్తు చేశారు. ఇప్పుడు కేవలం కోటి రూపాయలు మాత్రమే చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాచమల్లు మాటలు ఎవరూ నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Proddatur Constituency YSR District : రాచమల్లు అధికారంలో ఉన్న అయిదేళ్ల హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దుర్మార్గాలు, మోసాలు చేశారని వరదరాజుల రెడ్డి ఆరోపించారు. అవినీతి, అక్రమాలు చేసి ప్రజలను ఎలా ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో రాచమల్లుకు ఓటుతో బుద్ధి చెప్పాడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి చెందలన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా తనను, ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.