నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా పార్థసారథి నియామకం - నూజివీడు తెలుగుదేశం ఇన్‌ఛార్జ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 9:32 PM IST
Nujiveedu MLA Parthasarathy: ఏలూరు జిల్లా నూజివీడు తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌గా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియమించారు. ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేస ఆయన త్వరలో తెలుగుదేశంలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో నూజివీడు ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ, చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్థసారథి నియామకంతో ఏలూరు జిల్లాలో తెలుగుదేశం బలం పుంజుకుంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే పార్థసారథి నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను కలుస్తూ చిన్న చిన్న సమావేశాల్లో నిర్వహిస్తున్నారు. పార్థసారథిని ఇన్‌ఛార్జ్‌గా నియమించడానికి కారణాలను ఇప్పటికే నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ముద్దరబోయినకు చంద్రబాబు వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినత తరువాత ఉన్నతమైన స్థానం కల్పిస్తామని చంద్రబాబు ముద్దరబోయినకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్థసారథిని నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడ రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబు జిల్లా నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.