అంగన్వాడీల సమ్మె కాలానికి వేతానాలు చెల్లింపునకు ఉత్తర్వులు - anganwadi
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 16, 2024, 1:51 PM IST
Sub-Committee Consisting With Anganwadi Workers: వైఎస్సార్సీపీ ప్రభుత్వ గడువు మరో రోజులో ముగిసిపోనుండగా జగన్ సర్కార్ మరో ఎన్నికల ఎత్తు గడకు తెరతీసింది. తెలంగాణ తరహాలో గౌరవ వేతనం పెంచాలని కోరుతూ రోడ్డెక్కి నెత్తి నోరు బాదుకుంటూ 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేస్తే ఆ డిమాండ్లను తీర్చకుండానే విధుల నుంచి తొలగిస్తా మనే కత్తి వారి మెడ మీద పెట్టి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం విరమింపచేసింది. ఇతర సమస్యలను పరిష్కరిస్తామని తూతూమంత్రపు మాటలు చెప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ తర్వాత నెల రోజులు కిమ్మనకుండా ఉండి, ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీకి చైర్మన్గా మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆంగన్వాడీల నియామకాలు (Appointments), పదోన్నతులు (Promotions), బదిలీలు, క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధానం, తదితర వాటిని పరిశీలించనుంది. దీనితో పాటు అంగన్వాడీలు చేపట్టిన 42 రోజుల సమ్మె కాలాన్ని వేతనాలు చెల్లించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.