ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య- సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు - Student Suicide in Kurnool IIIT - STUDENT SUICIDE IN KURNOOL IIIT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 28, 2024, 1:26 PM IST
Student Suicide in Kurnool IIIT : కర్నూలులోని ట్రిపుల్ ఐటీ(డీఎం)లో విషాదం చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాయికార్తీక్ నాయుడు అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాలలోని వసతిగృహం 9వ అంతస్థుపై నుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాయికార్తీక్ ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చదువుల విషయంలో ఒత్తిడికి గురై, తల్లిదండ్రులు మందలించారని, ప్రేమలో విఫలమయ్యారని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకొని కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు.