డిమాండ్ల పరిష్కారం కోసం 6న సర్పంచుల 'చలో అసెంబ్లీ' - YVB Rajendra Prasad Chalo Assembly
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 3:01 PM IST
Panchayat Raj Chamber President YVB Rajendra Prasad On Chalo Assembly: సర్పంచుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీని ముట్టడిస్తామని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 12 వేల 918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం ద్వారా 8 వేల 629 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో జమ చెయ్యాలని డిమాండ్ చేశారు.
గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, గ్రామ పంచాయతీ, సర్పంచుల ఆధీనంలోనే పని చేయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయితీలకు ఇచ్చి సర్పంచ్లతో ఖర్చు చేయించాలన్నారు. గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చి, వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.