సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం - విద్యాశాఖలో ఖాళీల భర్తీకి ఆమోదం!
🎬 Watch Now: Feature Video
State Cabinet Meeting at Secretariat: అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలియచేయనుంది. డీఎస్సీ 2024 విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 6,100 పోస్టులతో డీఎస్సి నోటిఫికేషన్ జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఎస్సీఈఆర్టీ(SCERT)తో ఐబీ కరికులం ఒప్పందానికి ఆమోదం తెలపనుంది. పదో షెడ్యూల్లోని సంస్థల్లో బోధనేతర సిబ్బంది రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ కేబినేట్ నిర్ణయం తీసుకోనుంది. డిస్కంలకు 1500 కోట్లు రుణం తీసుకునేందుకు బ్యాంక్ హామీకి ఆమోదం తెలపనుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఆటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.