సమస్యలు పరిష్కరించకుండా బెదిరిస్తున్నారు: శ్రీరాంరెడ్డి తాగునీటి పథకం కార్మికులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 7:04 PM IST

4th Day Of Sri Ram Reddy Water Scheme Workers Strike: తాగునీటి సమస్యలు పరిష్కరించే స్థాయి నుంచి బెదిరించే స్థాయికి అధికారులు చేరుకున్నారని టీడీపీ ఇన్​ఛార్జి ఉమా మహేశ్వర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని శ్రీరామ్​రెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మె చేస్తుంటే అక్రమ అరెస్టుకు పాల్పడటం అన్యాయం అన్నారు. శ్రీరామ్​రెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మె నాలుగో రోజు ఉద్రిక్తంగా మారింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో తాగునీరు అందించే శ్రీరామ్​రెడ్డి నీటి పథకానికి సంబంధించిన మోటార్లను ఆఫ్ చేసి, తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు సమ్మె చేస్తుండగా పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్​కు తరలించారు.

సీఐటీయూ నాయకులు, కార్మికులను తీసుకువెళ్తున్న పోలీసు వాహనాన్ని కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. కార్మికులు ఆగ్రహించి పంప్​హౌస్ లోపలికి వెళ్లి షట్టర్ మూసుకొని ఆందోళన కొనసాగించారు. పంపు హౌస్ వద్దకు టీడీపీ నియోజకవర్గ ఉమా మహేశ్వర్ నాయుడు ఇతర నాయకులతో కలిసి చేరుకొని వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉమా ప్రభుత్వం తీరును తీవ్రంగా ఎండగట్టి, అధికారులు వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉమా మహేశ్వరనాయుడు పంప్ హౌస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్సీ శ్రీనివాసులు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి కార్మికులను ఒప్పించి పంప్​హౌస్ లోపల నుంచి బయటకు తీసుకువచ్చి పోలీస్ స్టేషన్​కు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.