రామతీర్థంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు - భారీగా తరలివచ్చిన భక్తులు - SRIRAMA NAVAMI CELEBRATIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 7:46 PM IST

Sri Ram Navami Celebrations in vizianagaram : శ్రీరామనవమి పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఈ మహోత్సవం కనులపండుగా సాగింది. దేవస్థానం కల్యాణోత్సవ మండపంపై నవమి వేడుకలతో పాటు, సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం పది గంటలకు ఈ మహోత్సవం ప్రారంభం కాగా, ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం, సీతారాముల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలు, పుష్ప, గంధాలతో అలంకరించారు.  

అంతకు ముందు ప్రత్యేక అధికారి సింహాచలం ఈవో శ్రీనివాసమూర్తి ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ శ్రీనివాసరావు సంప్రదాయబద్దంగా కుటుంబంతో కలిసి రాములోరికి పట్టు వస్త్రాలు అందచేశారు. రాములోరి కల్యాణోత్సవానికి భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్ల చేశారు. తీర్థ ప్రసాదాలు, తలంబ్రాలతో పాటు తాగునీరు, భోజన వసతి కల్పించారు. భక్తులు పెద్దఎత్తున సీతారాముల కల్యాణోత్సవానికి తరలి రావటంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.