'చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఏ ఒక్కరిని వదిలిపెట్టం' - SP GOWTAMI SALI warning - SP GOWTAMI SALI WARNING

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 3:48 PM IST

SP Gowtami Sali Press Meet in Kalyanadurgam : చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఏ ఒక్కరిని వదిలిపెట్టమని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి సాలి అన్నారు. కల్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె  కౌంటింగ్ తర్వాత కూడా సమస్యాత్మక గ్రామాల్లో భద్రతా చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. హింసకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ఎవరు ధ్వంసం చేసిన కేసులు కట్టడమే కాకుండా వారిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.

హింసకు పాల్పడే వారి పైన కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు, గెలవని అభ్యర్థులు వారి కింది క్యాడర్​కు ఇలాంటి హింసాత్మక ఘటనలకు వెళ్ళవద్దని చెప్పాలని సూచించారు. హింసాత్మక కార్యకలాపాలకు ఆజ్యం పోసేవారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని హెచ్చరించారు. రాజకీయనాయకుల అండతో బెదిరింపులు, అల్లర్లకు పాల్పడ్డ వారికి జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.