కన్నతండ్రిపై కుమారుడు కత్తితో దాడి - మందలించాడని ఘాతుకం - కత్తితో తండ్రిపై దాడి సత్యసాయి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 3:39 PM IST

Son Attacked on Father in Kadiri of Satyasai District : మద్యం మత్తులో కన్న తండ్రిపై కుమారుడు కత్తితో (Knife) దాడి చేసిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో జరిగింది. కత్తితో తండ్రిపై దాడి చేయగా తల, దవడ పైన తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు బాధితుడ్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయం తెలుసుకున్న ఇర్ఫాన్ కత్తితో ఆసుపత్రికి (Hospital) చేరుకున్నాడు. గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువులు భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, బంధువులు కత్తిని అతని చేతిలో నుంచి లాక్కొని పోలీసులకు అప్పగించారు. కుమారుడి చేతిలో దాడికి గురైన నజీర్ భాష పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి  తరలించారు.

మద్యానికి బానిసై డబ్బుల కోసం తరచూ కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. నాలుగు రోజుల కిందట ఇర్ఫాన్ తన అక్క భర్తపై దాడికి (Attack) యత్నించాడు. ఈ విషయమై నజీర్ భాష కొడుకుని మందలించాడు. తండ్రి మందలించడాన్ని అవమానంగా (Insult) భావించిన ఈ ఉదంతానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.