మచిలీపట్నం రైలులో పొగలు- పరుగులు తీసిన ప్రయాణికులు - Smoke in Dharmavaram Express - SMOKE IN DHARMAVARAM EXPRESS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 11:21 AM IST
Smoke in Dharmavaram Express : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్లో ధర్మవరం-మచిలీపట్నం వెళ్లే రైలుకు ప్రమాదం తప్పింది. రైలు చక్రాల కింద నుంచి ఉన్నట్టుండి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళకు లోనయ్యారు. బోగీలు కాలిపోతున్నాయన్న భయంతో వారు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేసి అందులోని ప్రయాణికులను కిందకు దించేశారు.
Dharmavaram Express Smoke Incident : ఈ క్రమంలోనే ట్రైన్ ఇంజిన్ బ్రేక్ లైనర్లు బలంగా పట్టేయడంతో రైల్లో పొగలు వ్యాపించినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు మరమ్మతులు చేశారు. రైలు చక్రాలకు ఉండే బ్రేక్‌లు సాంకేతిక లోపంతో పనిచేయకపోవడంతో బ్రేకర్ నుంచి పొగలు వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు ఇది సర్వ సాధారణమని పేర్కొన్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. సుమారు అరగంట పాటు ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్లో రైలుని నిలిపి సమస్యను పరిష్కరించామని వివరించారు. అనంతరం యథావిధిగా ప్రొద్దుటూరు నుంచి మచిలీపట్నంకు రైలు బయల్దేరి వెళ్లిందని అధికారులు వెల్లడించారు.