లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో వెండి వినాయకుడు - పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు - Silver Ganesha Procession
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 12:39 PM IST
Silver Ganesha Procession in Anantapur District : అనంతపురం జిల్లా గుంతకల్లులో లిమ్కా బుక్ అఫ్ రికార్డులో చోటు సంపాదించిన 115 కిలోల వెండి వినాయకుడిని ఘనంగా ఊరేగించారు. ఆవోపా వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో వరసిద్ధి వెండి వినాయకుడి ఊరేగింపు కనుల పండువగా జరిగింది. 27 సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయ పద్ధతిలో విగ్రహ దాత భాస్కర రంగయ్య ఇంటిలో ప్రత్యేక పూజలు చేశారు.
Guntakallu in Anantapur district : అనంతరం పల్లకి పై వెండి వినాయకుడిని ఉంచి కోదండ రామస్వామి ఆలయం నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం మీదుగా పురవీధుల్లో కనుల పండువగా ఊరేగింపు కార్యక్రమం సాగింది. వెండి గణనాథుడికి వేద పండితులు మంత్రోచ్ఛారణతో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం స్వామికి పంచగంగాలతో అభిషేకం, వెండి పుష్పాలతో అర్చన, ఊంజల్ సేవ తదితర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.