కాకినాడలో భారీగా మద్యం పట్టివేత - పోలీసుల అదుపులో డ్రైవర్ - Liquor Seized
🎬 Watch Now: Feature Video
SEB Officials Caught Illegal Liquor Transportation in Kakinada: రాష్ట్రంలో ఓ వైపు ఎన్నికల హడావుడి పెరుగుతుంటే మరోవైపు మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల వేళ ఎక్కడికక్కడ భారీగా మద్యం పట్టుబడుతోంది. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ నాయకులు నిల్వ చేసి ఉంచిన మద్యం భారీ ఎత్తున పట్టుబడుతోంది.
కాకినాడలో భారీగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ అధికారులు పట్టుకున్నారు. ఇంద్రపాలెం అంబేడ్కర్ కూడలి సమీపంలో మద్యం తరలిస్తున్న టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలుల రూ.21 లక్షలు ఉంటుందని సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు. ఎన్నికల వేల భారీగా మద్యం స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మూడు వాహనాల్లో మద్యాన్ని తరలిస్తున్నారని అనుమానాలు వస్తుండగా వాటి గురించి మీడియా ప్రతినిధులు సెబ్ అధికారులను ప్రశ్నించారు. వాటి గురించి తమకు తెలియదని అధికారులు తెలిపారు. వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రవికుమార్ తెలిపారు.