అక్షర యోధుడు రామోజీరావుకు సైకతశిల్పి ఘననివాళి - Artist Tribute to Ramoji Rao With Sand Sculpture - ARTIST TRIBUTE TO RAMOJI RAO WITH SAND SCULPTURE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 9, 2024, 10:39 AM IST

Artist Tribute to Ramoji Rao With Sand Sculpture : అక్షర యోధుడు ఈనాడు, ఈటీవీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు సైకత శిల్పి రేవెల్లి శంకర్ తనదైన రీతిలో నివాళులు అర్పించారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో ఇసుకతో సైకతశిల్పాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటారు. గ్రామీణ ప్రాంతాల్లోని తమ లాంటి కళాకారులను 'ఈనాడు -ఈటీవీ'ల ద్వారా బయటి ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మానవతావాదిగా రామోజీరావును అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది కళాకారుల ప్రతిభను వెలికి తీయడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని రేవెల్లి శంకర్ పేర్కొన్నారు. తనలాంటి కళాకారులకు అండగా ఉన్న రామోజీరావుకు నివాళులు అర్పించే అవకాశం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రామోజీరావు మహాభినిష్క్రమణం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి, సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు సంతాపం తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.