తహసీల్దార్ మందలింపు - సర్వేయర్ ఆత్మహత్యాయత్నం - tanakallu mro
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 7:44 PM IST
Sadum Surveyor Suicide Attempt in Satyasai District : తహసీల్దార్ మందలించారని మనస్థాపంతో సర్వేయర్ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. తనకల్లు మండలం టి. సదుం సచివాలయం సర్వేయర్ విజిత వాస్మోల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. సర్వే విషయంలో తహసీల్దార్ శోభా సువర్ణమ్మ మందలించడం వల్ల మనస్థాపానికి గురైన విజిత వాస్మోల్ తాగింది. విజిత తల్లి ఆమెను గమనించి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విధుల విషయంలో తహసీల్దార్ మందలించడం వల్లనే తమ బిడ్డ ఆత్మహత్యాయత్నం చేసిందని విజిత తల్లి వాపోయింది. రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సర్వేయర్ విజితకు సూచించినట్లు ఆమె తెలిపింది. విజిత చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందని తెలిపారు. ఇంతవరకు తామే బిడ్డను ఒక్క మాట కూడా అనలేదని తెలిపింది. రెవెన్యూ సిబ్బంది తనకు సహకరించలేదని సర్వేయర్ విజితను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించినట్లు ఎమ్మార్వో శోభా సువర్ణమ్మ తెలియజేశారు.