ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ పోలీస్ అధికారిగా ఎలాంటి కామెంట్ చేయను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - RS Praveen on Phone Tapping Case - RS PRAVEEN ON PHONE TAPPING CASE
🎬 Watch Now: Feature Video
Published : May 27, 2024, 5:37 PM IST
BRS RS Praveen Kumar On Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ విషయంపై తాను ఎలాంటి కామెంట్ చేయనని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో బాధ్యతాయుతమైన మాజీ పోలీస్ అధికారిగా ఏం మాట్లాడాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైన రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే వారు తప్పకుండా శిక్షార్హులే అన్నారు.
RS Praveen Kumar BRS Sridhar Murder : మరోవైపు బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఈ కేసుపై న్యాయం జరగపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మృతుడు శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఆయన డీజీపీ రవిగుప్తాకు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి వద్దనే హోంశాఖ ఉన్నందున సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను శిక్షించాలన్నారు.